Take a fresh look at your lifestyle.

హెల్త్ హబ్‌గా హైదరాబాద్ నగరం

  • ప్రైవేటు ఆసుపత్రిని ప్రారంభించిన ఎంపీ ఈటల

ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నగరం హెల్త్ హబ్‌గా, మెడికల్ టూరిజం అభివృద్ది చెందుతుందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం మాదాపూర్ శిల్పారామం వద్ద డాక్టర్ గౌడ్స్ డెంటల్ ఆసుపత్రిని ఎంపీ ఆర్. కృష్ణయ్యతో కలిసి ఎంపీ ఈటల ప్రారంభించారు.ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. డెంటల్ వైద్యంలో ప్రపంచ శ్రేణి చికిత్సను అందించే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగిందన్నారు.మెదక్ జిల్లాకు చెందిన ఎంఎస్ గౌడ్ మంచి పేరున్న వ్యక్తి అని, ఆయన ఒరవడిని డాక్టర్ వికాస్ కొనసాగిస్తున్నారని అన్నారు.ఈ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్యాన్ని విదేశీ రోగులకు సైతం అందజేస్తున్నారని అన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో ఎప్పటికప్పుడు ఇంప్లాంట్స్ తయారుచేయగలిగే ఈ సెంటర్ కలికితురాయిలా మారనుందన్నారు.ఈ ఆసుపత్రి నిర్వహకులు తెలంగాణ వాసిగా ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకోవాలని ఎంపీ ఈటల ఆకాంక్షించారు.అనంతరం ఎంపీ ఆర్, కృష్ణయ్య మాట్లాడుతూ.. ప్రపంచ గుర్తింపు పొందిన డాక్టర్ ఎంఎస్ గౌడ్ అంతర్జాతీయ స్థాయిలో వైద్యం అందిస్తున్నారని అన్నారు. అమెరికా తరువాత ఆ స్థాయిలో వైద్యం మన హైదరాబాద్ లో అందుతుందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.