ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
శనివారం నుంచి ప్రారంభం అయిన పదవ తరగతి పరీక్షల నిర్వహణకు సంబందించి జఫ్స్ బాయ్స్ వికారాబాద్ స్కూల్ లో జరుగుతున్న పదవ తరగతి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధింపు, బయటి వ్యక్తుల ప్రవేశంపై నిషేధం, సిసి టివి కెమెరాల ద్వారా పర్యవేక్షణ వంటి కఠిన చర్యలను పాటించాలని అదనపు కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు తాగునీరు, ఫ్యాన్లు, డెస్కులు, సరైన వెలుతురు ఉండేలా చూడాలని వేసవి తీవ్రత కారణంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు
అదనపు కలెక్టర్ తో పాటు జిల్లా విద్యా శాఖ అధికారి రేణుకా దేవి తదితరులు ఉన్నారు.