మంథని, ముద్ర విలేకరి :పెద్దపల్లి జిల్లా విద్యాధికారి మాధవి శనివారం మంథని మండలం కన్నాల గ్రామంలోని ఉన్నత పాఠశాల,కన్నాల ప్రాథమిక పాఠశాల,నాగారం పాఠశాల లను ఆకస్మిక సందర్శన చేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రారంభించిన ఏఐ తరగతులను మరియు ఎల్ఐపి మరియు ఎఫ్ఎల్ఎన్ తరగతులు పరిశీలించి విద్యార్థులు, ఉపాధ్యాలకు తగిన సూచనలు చేశారు.క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ చేసి ఉపాధ్యాయుల బోధన పరిశీలన, విద్యార్థుల సామర్థ్యాలను గమనించి తగిన సూచనలు చేశారు. ఎఫ్ఆర్ఎస్ విషయం, లైబ్రరీ,గేమ్స్ ఉండాలి అన్నారు.అదేవిధంగా విద్యార్థులు ప్రతి రోజూ 100 శాతం హాజరు కావాలని,అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని, పదవ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని అన్నారు.ఈ సందర్భంగా డిఈఓ తో పాటు ఏంఈఓ లక్ష్మీ,హెచ్ఏం హరి ప్రసాద్,డిఆర్ పి రవీందర్,పిఎస్ హెచ్ఏం మధు పాల్గొన్నారు.