- రాహుల్ గాంధీకి కేటీఆర్ ప్రశ్న.
- పేదల జీవితాలపై బుల్డోజర్ల తో దాడి చేస్తున్నారని మండిపాటు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రతిరోజు పేదల ఇళ్లతో పాటు వారి జీవితాలపై బుల్డోజర్ల తో దాడి చేయడం ఏంటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రశ్నించారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుల్డోజర్ కంపెనీలతో రహస్య ఒప్పందం ఏమైనా ఉందా అని నిలదీశారు. తాజాగా వరంగల్ లో కూల్చివేతలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.బుధవారం మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వరంగల్ లోని వెయ్యి స్తంభాల గుడి, రామప్ప ఆలయాన్ని సందర్శిస్తున్న నేపథ్యంలో వరంగల్ లో అధికారులు పేదల ఇళ్లను కూల్చుతున్నారని ఆరోపించారు.అందాల పోటీల కోసం పేదల ఇళ్లను ధ్వంసం చేయడమేనా ప్రజాపాలన అంటే అని నిలదీశారు.రాజభవనాలలో విలాసవంతమైన విందులు చేసి రూ. 200 కోట్లతో పాటు రూ. కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిన తర్వాత మీ కృరమైన బుల్డోజర్లతో పేదల జీవితాలను నలిపివేయాల్సి వచ్చిందా అని నిలదీసారు.ఇంత చేశాక మీది ప్రజాపాలన అని పిలుచుకోవడం హాస్యాస్పదంగా ఉందని.. రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వ అమానవీయ చర్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.