50శాతం పెంపుతో డీలిమిటేషన్ ప్రమాదకరం
ఉత్తర, దక్షిణాది గ్యాప్ పెంచవద్దు
మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి
మహిళా రిజర్వేషన్లకు అడ్డు కాదు
పునర్విభజనపై తొందర వద్దు
కేంద్రంపై పోరాటం చేయాల్సిందే
ముద్ర, తెలంగాణ బ్యూరో :
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో 50 శాతం దామాషా ప్రతిపాదన దేశానికి ప్రమాదకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును ముసుగుగా వాడుకుని దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేలా కేంద్రం డీలిమిటేషన్ ప్రక్రియను చేపడుతోందని ఆరోపించారు. కేవలం జనాభా ప్రాతిపదికన సీట్ల సంఖ్యను పెంచడం వల్ల ఉత్తరాది రాష్ట్రాలకు రాజకీయ బలం పెరుగుతుందని, అభివృద్ధిలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న 50 శాతం పెంపు ఫార్ములాను తాము వ్యతిరేకిస్తున్నామని, ఈ విధానం అమలులోకి వస్తే కేరళ వంటి చిన్న రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల సీట్ల అంతరం ఏకంగా 90కి పెరుగుతుందని గణాంకాలతో వివరించారు. ఉత్తరాది రాష్ట్రాలు పొలిటికల్ క్యాపిటల్స్ గా మారుతుంటే, దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఫైనాన్షియల్ క్యాపిటల్స్ గా సేవలందిస్తున్నాయని, జనాభా నియంత్రణ పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలకు శిక్ష విధిస్తారా? అని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని నిలదీశారు.
రెండింటికీ లింక్
మహిళా రిజర్వేషన్ల అంశంలో తమ పూర్తి మద్దతు ఉందని, అయితే దానికి డీలిమిటేషన్‌తో లింక్ పెట్టడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడున్న సీట్లలోనే మహిళలకు కోటా కేటాయించి గత ఎన్నికల నుంచే అమలు చేయాల్సి ఉండేదని ఆయన గుర్తు చేశారు. నియోజకవర్గాల పెంపునకు కేవలం జనాభానే కాకుండా రాష్ట్రాల జిఎస్‌డిపి , ఇతర అభివృద్ధి సూచీలను కూడా ప్రామాణికంగా తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పునర్విభజన విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం దేశ సమగ్రతకు మరియు సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రాంతీయ సమతుల్యత దెబ్బతినకుండా ఉండేందుకు తక్షణమే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన ప్రత్యామ్నాయ నమూనాలను పరిశీలించిన తర్వాతే కేంద్రం ముందడుగు వేయాలని ఆయన సూచించారు. చిన్న రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడటంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఈ అంశంపై ఇతర రాష్ట్రాల నేతలతో కలిసి పోరాడతామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తన పార్టీ ప్రయోజనాలను పక్కన పెట్టి, దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయం సాధించిన తర్వాతే ఈ సున్నితమైన విధానాలపై నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దీనివల్ల ఏర్పడే అసమానతలు దీర్ఘకాలంలో దేశ అంతర్గత భద్రతకు కూడా ముప్పుగా మారే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండు కూడా వేర్వేరు అంశాలని, అయితే రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వీటిని కావాలనే కలిపి గందరగోళం సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు.
మేం వ్యతిరేకం కాదు
మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పెంపు అనేవి దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశాలని, ఇవి కేవలం ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాలు కాదని, యావత్ దేశ ప్రజల అస్తిత్వానికి సంబంధించినవని చెప్పారు. కానీ, బీజేపీ మాత్రం ఈ అంశాలను తమ సొంత రాజకీయ ఎజెండాగా మార్చుకుంటూ, ప్రతిపక్షాలపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఆయన మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకమంటూ బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని సీఎం తీవ్రంగా ఖండించారు. భారతదేశంలో మహిళలకు ఓటు హక్కు కల్పించడంతో పాటు, చట్టసభల్లో, సమాజంలో వారికి సమాన హక్కులు కల్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని ఆయన గుర్తు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే కేంద్రం దేశవ్యాప్తంగా ఒక రకమైన కృత్రిమ హడావిడిని సృష్టిస్తోందని, నిజంగా మహిళలపై గౌరవం ఉంటే 2024 సార్వత్రిక ఎన్నికల నుండే ఈ కోటాను ఎందుకు అమలు చేయలేదని ఆయన నిలదీశారు. నిజానికి, 2024 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేసి ఉంటే, ఈపాటికి మరింత మంది మహిళా ప్రతినిధులు చట్టసభల్లో అడుగుపెట్టి ఉండేవారని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే, 2011 జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లను ముడిపెట్టడం వెనుక ఒక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇది కేవలం జనాభా లెక్కల వ్యవహారం కాదని, ప్రాంతీయ వివక్షకు పరాకాష్ట అని ఆయన పేర్కొన్నారు.ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం చూపుతున్న వివక్షను ఎండగట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెబుతూనే, ప్రస్తుతం ఉన్న స్థానాల ప్రాతిపదికన ఈ కోటాను తక్షణమే (రాబోయే ఆరు నెలల్లోనే) అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియ ప్రస్తుతం ఒక ప్రమాదకరమైన మలుపు తిరుగుతోందని, ఇది చిన్న రాష్ట్రాలకు, ముఖ్యంగా దక్షిణాదికి తీరని అన్యాయం చేసే కుట్ర అని ఆయన హెచ్చరించారు.
దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను అత్యంత సమర్థవంతంగా అమలు చేశాయి. దీనివల్ల ఇక్కడ జనాభా నియంత్రణలోకి వచ్చింది. కానీ, ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో అక్కడ జనాభా విపరీతంగా పెరిగింది. ఇప్పుడు కేవలం జనాభానే ప్రాతిపదికగా తీసుకుని ఎంపీ సీట్లను పెంచితే, బాధ్యతాయుతంగా వ్యవహరించిన దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గి, ఉత్తరాది ఆధిపత్యం పెరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల, 2026 జనాభా లెక్కల ప్రక్రియ పూర్తయ్యాక, శాస్త్రీయంగా, అన్ని రాష్ట్రాలకు న్యాయం జరిగేలా డీలిమిటేషన్ ఉండాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన రాష్ట్రాలను శిక్షించే విధంగా కేంద్ర నిర్ణయాలు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరాది రాష్ట్రాలు దేశానికి రాజకీయ రాజధానులైతే, దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక రాజధానులని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరగకూడదని ఆయన స్పష్టం చేశారు. దేశానికి అత్యధిక ఆదాయం, జీఎస్‌డీపీ అందిస్తున్న ఈ రాష్ట్రాలను డీలిమిటేషన్ పేరుతో శిక్షించడం దేశానికి ప్రమాదకరమని హెచ్చరించారు. కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని పేర్కొంటూ, ప్రతిపాదిత 273 అదనపు సీట్లలో 50 శాతం జనాభా ఆధారంగా, మిగిలిన 50 శాతం ఆయా రాష్ట్రాల ఆర్థిక వృద్ధి రేటు ఆధారంగా కేటాయించాలని సూచించారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరగాలని ఆయన కోరారు. డీలిమిటేషన్ వల్ల ఉత్తరాది రాష్ట్రాలకు సుమారు 208 అదనపు సీట్లు పెరిగే అవకాశం ఉందని, అలా జరిగితే కేంద్రంలో మెజారిటీ కోసం దక్షిణాది రాష్ట్రాల అవసరం తగ్గిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశ సమగ్రతకు, ఉత్తర–దక్షిణ ప్రాంతాల మధ్య సమతుల్యతకు విఘాతం కలిగిస్తుందని హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేసిన సీఎం, డీలిమిటేషన్ విషయంలో మాత్రం తొందరపడకూడదని సూచించారు. 2028 వరకు సమయం ఉన్నందున, అన్ని వర్గాలతో చర్చించి, సమగ్రంగా ఆలోచించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న 50 శాతం పెంపు ఫార్ములాను రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విధానం అమలులోకి వస్తే కేరళ వంటి చిన్న రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల సీట్ల అంతరం ఏకంగా 90కి పెరుగుతుందని ఆయన గణాంకాలతో వివరించారు. ఉత్తరాది రాష్ట్రాలు పొలిటికల్ క్యాపిటల్స్ గా మారుతుంటే, దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఫైనాన్షియల్ క్యాపిటల్స్ గా సేవలందిస్తున్నాయని.. జనాభా నియంత్రణ పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలకు శిక్ష విధిస్తారా? అని ఆయన కేంద్రాన్ని నిలదీశారు.
మహిళా రిజర్వేషన్లపై తమకు పూర్తి మద్దతు ఉందని, అయితే దానికి డీలిమిటేషన్‌తో లింక్ పెట్టడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడున్న సీట్లలోనే మహిళలకు కోటా కేటాయించి గత ఎన్నికల నుంచే అమలు చేయాల్సి ఉండేదని ఆయన గుర్తు చేశారు. నియోజకవర్గాల పెంపునకు కేవలం జనాభానే కాకుండా రాష్ట్రాల జిఎస్‌డిపి , ఇతర అభివృద్ధి సూచీలను కూడా ప్రామాణికంగా తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాంతీయ సమతుల్యత దెబ్బతినకుండా ఉండేందుకు తక్షణమే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన ప్రత్యామ్నాయ నమూనాలను పరిశీలించిన తర్వాతే కేంద్రం ముందడుగు వేయాలని ఆయన సూచించారు.
సీట్ల పెంపునకు ‘హైబ్రిడ్ మోడల్’
దేశ ఆర్థిక వ్యవస్థకు దక్షిణాది రాష్ట్రాలు వెన్నెముకగా నిలుస్తున్నాయని, పన్నుల రూపంలో అత్యధిక ఆదాయాన్ని ఇస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రాష్ట్రాలను కేవలం జనాభా ప్రాతిపదికన ఎలా శిక్షిస్తారని సీఎం ప్రశ్నించారు. ఈ సమస్య పరిష్కారానికి ఆయన ఒక ‘హైబ్రిడ్ మోడల్’ ను ప్రతిపాదించారు. కొత్తగా 272 లోక్‌సభ సీట్లను పెంచాలని భావిస్తే.. అందులో సగం (136 సీట్లు) జనాభా ప్రాతిపదికన (ప్రోరేటా), మిగతా సగం (136 సీట్లు) రాష్ట్రాల స్థూల ఉత్పత్తి (GSDP – ఆర్థిక సహకారం) ఆధారంగా పెంచాలన్నారు.దీనివల్ల దేశ ప్రగతిలో అత్యధిక భాగస్వామ్యం అందిస్తున్న రాష్ట్రాలకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం దక్కుతుందని సీఎం చెప్పారు.
కలిసి పోరాడాల్సిందే
చిన్న రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడటంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఈ అంశంపై ఇతర రాష్ట్రాల నేతలతో కలిసి పోరాడతామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తన పార్టీ ప్రయోజనాలను పక్కన పెట్టి, దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయం సాధించిన తర్వాతే ఈ సున్నితమైన విధానాలపై నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దీనివల్ల ఏర్పడే అసమానతలు దీర్ఘకాలంలో దేశ అంతర్గత భద్రతకు కూడా ముప్పుగా మారే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు