ముద్ర ప్రతినిధి, జగిత్యాల: శ్రీ సత్యసాయి బాబా ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆద్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని వీది చిరు వ్యాపారాలకు ఎండ, వర్షం నుండి రక్షణగా ఉపయోగపడేలా గొడుగుల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సత్యసాయి సంస్థ కన్వీనర్ బట్టు రాజేందర్ మాట్లాడుతూ భక్తులందరి సహకారంతో ఈ గొడుగుల పంపిణీ సేవతో పాటు, అలాగే వివిధ దీనజన సేవలు నిర్వహిస్తామని ముఖ్యంగా 2 నెలల పాటు ఈ వేసవి కాలానికి ప్రతిరోజు ఉచితంగా మినరల్ వాటర్ అందించడం జరుగుతుందని, చెప్పులు, తల టోపీలు, బట్టర్ మిల్క్ వంటి తదితర వాటి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.సేవలకు సహకరిస్తున్న భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిటుమల్ల లక్ష్మీనారాయణ, తాటిపర్తి దశరథ రెడ్డి, గుండ రాజశేఖర్, పిప్పరి రాజేందర్, గణపతి నరేందర్ రాజు , మహంకాళి మహేష్ మరియు మహిళా సభ్యులు బట్టు శ్రీలత, తాటిపర్తి స్వప్న, గుండ అర్చన, జక్కం సరిత, సామ రజిత, వూటూరి నాగరాణి, బట్టు సాధన , మార విజయలక్ష్మి, బట్టు దీప, బట్టు ఆనంద వర్దిని పాల్గొన్నారు.
