మాదాపూర్, ముద్ర విలేఖరి: మియాపూర్ డివిజన్ పరిధిలోని నాగార్జున ఎనక్లేవ్ కాలనీ లో ఎమ్మెల్యే నిధుల నుండి రూ. 50 లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే మంచి నీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, జలమండలి అధికారులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ.ఈ సందర్భంగా చైర్మన్ గాంధీ మాట్లాడుతూ నాగార్జున ఎనక్లేవ్ కాలనీ వాసుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. నాగార్జున ఎనక్లేవ్ కాలనీ వాసులకు స్వచ్చమైన మంచి నీరు అందించడమే ధ్యేయంగా పనిచేస్తాం అని అదేవిధంగా ప్రతి కాలనీ లో స్వచ్ఛమైన మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం చేపట్టడం ద్వారా కాలనీ వాసులకు ప్రజలకు, స్వచైమన మంచి నీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని చైర్మన్ గాంధీ అన్నారు.ఏ చిన్న సమస్య అయిన నా దృష్టికి,కార్పొరేటర్ గార్ల దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ,కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతు సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని చైర్మన్ గాంధీ తెలియచేసారు.మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని మంచి నీటి పైప్ లైన్ నిర్మాణము వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు నారాయణ మేనేజర్లు సునీత,శిరీష మరియు నాయకులు కార్యకర్తలు, కాలనీల అసోసియేషన్ సభ్యులు,కాలనీ వాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
