Take a fresh look at your lifestyle.

బీసీలకు కాంగ్రెస్‌ ఘరానా మోసం

  • ఓట్లు దండుకునేందుకే బి.సీ.ల రిజర్వేషన్ల నాటకం.
  • రాష్ట్రంలో ఆర్డినెన్స్‌ డ్రామా అడుతున్న కాంగ్రెస్ సర్కార్.
  • రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్.

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: రాష్ట్రంలో బీసీల మనోభావాలు దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తుంది.వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం కోసం ఆర్డినెన్స్ ను తీసుకువస్తున్నట్టు ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు వ్యవహార శైలిపై పలు అనుమానాలు కలుగుతు న్నాయని,ఇందులో ద్రోహంతో కూడిన కుట్ర కనిపిస్తున్నదని వచ్చే ఎన్నికల్లో బీసీల ఓట్లు కొల్లగొట్టేం దుకే ఈ రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ ల ఓట్లను దండు కోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ పై ఆర్డినెన్స్ నాటకం మొదలు పెట్టిందనీ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని వెల్లడించి, 20 నెలలు కాలయాపన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రప్రభుత్వానికి, రాష్ట్రపతి ఆమోదానికి పంపడం జరిగిందని,ఇప్పుడు కొత్తగా ఆర్డినెన్స్ పేరుతో మరో మోసానికి తెరలేపిందని ఆరోపించారు.గతంలో మహారాష్ట్ర,బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ పెంచాలని చూస్తే కోర్టులు కొట్టివేసినవిషయం ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు.తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, జాతీయస్థాయిలో ప్రతిపక్ష హోదా లో ఉన్న అయినప్పటికీ బీసీ బిల్లు విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేదని విమర్శించారు. అన్నీ తెలిసి కూడా బీసీలకు ద్రోహం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఖండిస్తున్నామన్నారు.42శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే కాంగ్రెస్ సర్కారు ప్రజల ఆగ్రహానికిగురికాక తప్పదని హెచ్చరించారు.
బీసీ రిజర్వేషన్ల విష యంలో ఈ సర్కార్ ఘరానా మోసానికి పాల్పడుతుంది.అసెంబ్లీలో పెట్టిన బీసీ బిల్లులను గవర్నర్ ద్వారా ఢిల్లీకి పంపారని, ప్రస్తుతం అది కేంద్రం వద్ద ఉన్నదని,ఈ నేపథ్యం లో ఇప్పుడు దానిని కాదని, ఆర్డినెన్స్ తీసుకురావడమేమిటని ప్రశ్నించారు.గతంలో మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్ రాష్ట్రాల్లో కూడా ఇలాగే జీవో జారీ చేస్తే అవి కోర్టుల్లో నిలబడలేదని గుర్తు చేశారు.చట్టబద్ధత లేని కులగణన జరిపిన కాంగ్రెస్ ప్రభుత్వంచేపట్టిన కులగణన చెల్లదని కేంద్రప్రభుత్వం కూడా తెలుపడం జరిగిందని అయినా ఇంకా బిసీ లను మోసం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి బీసీ లు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.ఈ విలేఖరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మురళీధర్ రావు, బొడ్డు రవీందర్, నారాయణదాసు మారుతి, కల్వచర్ల కృష్ణవేణి, బాదే అంజలి, గాదo విజయ, పిల్లి రమేష్, జిట్టవేన ప్రశాంత్, గుంపుల లక్ష్మీ, నూతి తిరుపతి, వెంకటేష్, రామకృష్ణ, సత్యప్రసాద్, నీరటి శ్రీనివాస్, తోకల రమేష్, సట్టు శ్రీనివాస్, కుమార్ నాయక్, మొగిలి పద్మ గౌడ్, సారయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.