Take a fresh look at your lifestyle.

కుల నిర్మూలనతోనే అంబేద్కర్ ఆశయం సిద్ధిస్తుంది జయంతి సభలో వక్తలు

 

మహదేవపూర్, ముద్ర:

సమాజంలో కుల వ్యవస్థ పైన అంబేద్కర్ ఆశయ సాధన సాకారం అవుతుందని వక్తలు ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు, వయోజన ఓటు హక్కు, ప్రాథమిక హక్కులను సమానత్వాన్ని రక్తపాతం లేకుండా వ్యవస్థాపర పోరాటంతో సాధించిన మహనీయుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఏకతాటి పైకి రావాలని రాజ్యాధికారం దిశగా ముందుకు సాగాలని కోరారు. సామాజికంగా దుర్భర పరిస్థితులు అనుభవిస్తూనే ఉన్నత విద్యలను అభ్యసించి భారత రాజకీయ చిత్రంపై తనదంటూ ఒక ముద్ర వేసుకున్న అంబేద్కర్ ప్రపంచంలోనే జ్ఞానవంతులలో సాటి లేని వ్యక్తిగా నిలిచారని పేర్కొన్నారు. నూతన అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించడంతోపాటు ఏర్పాటుచేసిన సభా కార్యక్రమానికి ఉత్సవ సమితి అధ్యక్షులు లింగాల రామయ్య అధ్యక్షత వహించగా సర్పంచ్ హసీరాబాను ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అంబేద్కర్ రిజర్వేషన్ల వల్లనే తాను రెండుసార్లు ప్రజాప్రతినిధిగా కాగలిగాలని కుల, మత, భేద భావాలు తనకు ఉండవని ఎవరు పాటించకూడదని అన్నారు. దళిత నాయకులు బెల్లంకొండ సురేష్, మెరుగు లక్ష్మణ్, నల్లభూగ ధర్మయ్య, రాందాసు, వేమునూరు జక్కయ్య, పసుల శంకర్, చందు, రాజశేఖర్, కిరణ్, చంద్రమౌళి, మైనార్టీ నాయకులు అమీన్, ఇర్షాద్ విద్యావేత్త ఎం ఎం శషి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుడాల శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు. ర్యాలీ అనంతరం నిర్వహించిన సభకు పెద్ద ఎత్తున ప్రజాసంఘాల నాయకులు ప్రజలు హాజరయ్యారు. ఎడపల్లిలో సర్పంచ్ మోతే నీలారాణి సాంబయ్య, మద్దులపల్లి గ్రామంలో సర్పంచ్ వేల్పుల సరిత ఆధ్వర్యంలో కాటారం మండల కేంద్రంలో జాక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 135వ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.