కోరుట్ల, ముద్ర;
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు మెట్ పల్లి లోని నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డా. రఘు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి గొప్ప విలువలను అందించిన మహానుభావుడని అన్నారు. ఆయన రూపొందించిన భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి హక్కులను కల్పించిందని, అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలు అమూల్యమని చెప్పారు.
విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని అంబేద్కర్ సందేశం నేటికీ ప్రాసంగికమని తెలిపారు. యువత అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. సమాజంలో అసమానతలను తొలగించి సమగ్ర అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, నల్ల వెంకటేష్, రాజన్న, కోరుట్ల రాజ్, జోగినిపల్లి రవితేజ, వాజిద్ బేగ్, జాపిరి పవన్ కళ్యాణ్, మోతే శ్రీకాంత్, ఎక్కల్ ధనుష్, శ్రీకర్, వంశీ, తదితరులు పాల్గొన్నారు.