Take a fresh look at your lifestyle.

నల్ల బ్యాడ్జీలతో జూనియర్ లెక్చరర్ల నిరసన

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసే జూనియర్ లెక్చరర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసే జూనియర్ లెక్చరర్ లకు రెండవ వార్షిక ఇంక్రిమెంట్ ఆయా కళాశాల ప్రిన్సిపాల్స్ నిలుపుదల చేసినందుకు నిరసనగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసే జూనియర్ లెక్చరర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష విధులకు హాజరయ్యారు.తమకు న్యాయబద్ధంగా వచ్చేటువంటి వార్షిక ఇంక్రిమెంట్ ను కొందరు ప్రిన్సిపల్స్ అన్యాయంగా నిలిపివేశారు అని జూనియర్ లెక్చరర్లు ఆరోపించారు. తక్షణమే ఇంటర్మీడియట్ ఉన్నత అధికారులు స్పందించి తమకు వార్షిక ఇంక్రిమెంట్ ను ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ 711 అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర నాయకులు, ప్రాథమిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.