ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: ఈ నెల 16న రాష్ట్ర మంత్రులు పెద్దపల్లి లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని ఎమ్మెల్యే విజయరమణ రావు తెలిపారు. పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, జిల్లా ప్రజా ప్రతినిధులు, ఇతర నాయకులు ముఖ్య అతిధులుగా విచ్చేస్తున్న సందర్బంగా పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సభ ఏర్పాట్లను ఆయన స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ మరియు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.