Take a fresh look at your lifestyle.

చెత్తను తరలించడంలో నిర్లక్ష్యం

రామకృష్ణాపూర్,ముద్ర విలేకరి : సింగరేణి కార్మికుల వాడలో పేరుకు పోయిన చెత్తను తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోజులు గడుస్తున్న చెత్తను తరలించేందుకు ఆలస్యం చేస్తున్నారు. స్థానిక అశోక్ నగర్ సమీపంలో చెత్త రహదారిపైకి వస్తుంది దీంతో వాహన చోదకులకు ఇబ్బందులు తప్పడం లేదు. పేరుకుపోయిన చెత్తతో దుర్వాసన వెదజల్లుతున్నాయని కార్మిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సివిల్ డిపార్ట్మెంట్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.