కరీంనగర్ పట్టణ ఆవోపా ఆధ్వర్యంలో స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీలో అవోప తపోభవన్ పేరిట నిర్మించబోయే మూడంతస్తుల భవనానికి శుక్రవారం ఉదయం భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది . పట్టణ ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (AVOPA) ఆధ్వర్యంలో నిరుపేద ఆర్యవైశ్యులకు ఉపయోగపడే విధంగా సహృదయ దాతల సహాయ సహకారంతో మూడంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నట్టు పట్టణ ఆవోప అధ్యక్షులు నలుమాసు సుదర్శనం తెలియజేశారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర అవోప ముఖ్య సలహాదారు గంజి స్వరాజబాబు, ఆర్యవైశ్య వాసవి వృద్ధాశ్రమ వ్యవస్థాపక చైర్మన్ తోట లక్ష్మణరావు, జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కన్న కృష్ణ, రాష్ట్ర ఆవోప ఉపాధ్యక్షులు సామ నారాయణ, పివి రామకృష్ణ, ఆవోప భవన్ ట్రస్ట్ అధ్యక్షులు కట్కూరి సుధాకర్,66వ డివిజన్ కార్పొరేటర్ వంగల పవన్, 57 వ డివిజన్ కార్పొరేటర్ కొలిపాక రమ్య- శ్రీనివాస్, పట్టణ అవోపా సలహాదారు ఉప్పుల రామేశం, జిల్లా ఆవోప ప్రధాన కార్యదర్శి అయిత ఈశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ పట్టణ అవోప నిర్వహిస్తున్నటువంటి క్యాలెండర్ ఈవెంట్స్ తో పాటు పలు సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహించడం పట్ల పాలకవర్గాన్ని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నలు మాచు చంద్రశేఖర్, గజవాడ శ్రీనివాస్ ,కోశాధికారి కట్కూరి చంద్రశేఖర్, అయిత యోగేంద్ర ప్రసాద్, పుల్లూరి రవీందర్, బివి ప్రవీణ్ కుమార్, ముస్త్యాల సతీష్ కుమార్, నలుమాసు శారద, నలుమాచు రాణి తదితరులు పాల్గొన్నారు