Take a fresh look at your lifestyle.

వైభవంగా శ్రీవేంకటేశ్వరుని రథోత్సవం – మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రత్యేక పూజలు

 

బీబీనగర్, ముద్ర ప్రతినిధి: బీబీనగర్ మండలం రహీంఖాన్ గూడ (అన్నవరం) గ్రామంలో వేంచేసివున్న శ్రీ పద్మావతి అలిమేల్ మంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున నుంచి స్వామి రథోత్సవం కన్నులపండువగా జరిగింది. స్వామి వారు రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భువనగిరి మాజీ శాసనసభ్యుడు పైళ్ల శేఖర్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్, గ్రామసర్పంచి, ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీబీనగర్ మండల మాజీ ఎంపీపీ ఎరుకల సుధాకర్ గౌడ్, బీబీనగర్ మండల రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు బొక్క జైపాల్ రెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గాదె నరేందర్ రెడ్డి, బీబీనగర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, కార్యదర్శి రాచమల్ల శ్రీనివాసులు, చింతల సుదర్శన్ రెడ్డి, భువనగిరి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొలను లావణ్య దేవేందర్ రెడ్డి, బిఆర్ఎస్ జిల్లా నాయకురాలు గాదే కవిత, బీబీనగర్ మండల మాజీ వైస్ ఎంపీపీ కొంతం లింగయ్య గౌడ

 

Leave A Reply

Your email address will not be published.