శభాష్ సాయిబాబు అంటున్న ప్రజలు
ముద్ర, తుంగతుర్తి….
సంఘసంస్కర్త స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా తుంగతుర్తి మండల కేంద్రంలోని జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని స్థానిక సర్పంచ్ మల్లెపాక సాయిబాబు నీళ్లతో కడిగి శుభ్రపరిచారు. అలాగే జగ్జీవన్ రామ్ విగ్రహంతో పాటు పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహ పరిసరాలను స్థానిక గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి శుభ్రపరిచారు. విగ్రహానికి పూలమాలలు వేసి పత్రికల్లో రావాలని చూసే నేటి రోజుల్లో ముందుగా దుమ్ము ధూళితో కూడుకొని ఉన్న విగ్రహాన్ని బకెట్ తో నీరుని తీసుకువెళ్లి పరిశుభ్రంగా కడిగిన సాయిబాబా పనితీరు పట్ల తుంగతుర్తి గ్రామ వాసులు శభాష్ అంటున్నారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ అట్టడుగు వర్గాల కోసం పోరాడిన వ్యక్తి అని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. సమాజంలో సత్ప్రవర్తన కలిగి మంచి ఉద్దేశంతో గ్రామాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని నాడే గ్రామ సీమలన్నీ పారిశుద్ధ్యంతో అలాగే మిగతా అన్ని రంగాల్లో ముందుంటుందని అన్నారు. ఈ సందర్భంగా సాయిబాబు వెంట తుంగతుర్తి గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.