Take a fresh look at your lifestyle.

మాజీ మంత్రి పొన్నాల ఇంట్లో చోరీ

ముద్ర, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి , బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగింది. జూబ్లీహిల్స్ లోని ఫిలింనగర్ లో ఉన్న ఆయన ఇంట్లో చొరబడిన దొంగలు రూ. లక్షన్నరతో పాటు భారీగా బంగారు ఆభరణాలను దోచుకెళ్ళారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పొన్నాల సతీమణి అరుణా దేవీ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. పొన్నాల ఇంటి పరసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇదిలావుండగా చోరీ జరిగిన సమయంలో పొన్నాల లక్ష్మయ్య కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేరని తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.