ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌లోని షేక్‌పేట్ భారీ అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం ఐదున్నర గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. షేక్‌పేట్‌లోని రిలయన్స్ ట్రెండ్స్ షాపు ఉన్న బిల్డింగ్‌లో ఈ ఘటన జరిగింది. అదే బిల్డింగ్ లోని సెకండ్ ఫ్లోర్‌లోవున్న ఆకాష్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌లో తొలుత మంటలు చెలరేగాయి. అక్కడి నుంచి పైఅంతస్తులకు మంటలు వ్యాపించాయి.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. దాదాపు మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రమాద సమయంలో బిల్డింగ్‌లో ముగ్గురు వ్యక్తులున్నారు. వారిని సురక్షితంగా ఫైర్ సిబ్బంది కాపాడారు. సెకండ్ ఫ్లోర్‌లో అధికంగా ఫర్నిచర్ ఉండడంతో పైఅంతస్థుల వరకు మంటలు వ్యాపించాయని ఫైర్ సిబ్బంది చెప్పారు. అగ్నిప్రమాదం ఎలా జరిగింది? అనే అంశంపై విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణమా? లేక మరేమైనా జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.