Take a fresh look at your lifestyle.

జూలై 1నుండి సఫారీ సేవలు నిలిపివేత

  • వన్యప్రాణుల సంతానోత్పత్తికి ఇదే సరైన సమయం.
  • జూలై 1 నుండి సెప్టెంబర్ 30 వరకు సఫారీ సేవలు పూర్తిగా నిషేధం.
  • డి ఎఫ్ ఓ రోహిత్ గోపిడి.

అచ్చంపేట ముద్ర విలేఖరి: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం పర్హహాబాద్ నల్లమల అటవీ ప్రాంతంలో జూలై 1 నుండి సఫారీ వాహన సేవలు నిలిపివేయనున్నట్లు డిఎఫ్ఓ రోహిత్ గోపిడి తెలిపారు. తొలకరి వర్షాలు పడుతున్న ఈ సమయంలో వన్య ప్రాణులకు సంతాన ఉత్పత్తికి చాలా అనువైన సమయమని ముఖ్యంగా పెద్దపులులూ, చిరుత పులులు, జింకలు, ఎలుగుబండ్లు, మనుబోతులు, నక్కలు మొదలగునవి వన్యప్రాణులు మనుషుల అలికిడికి సఫారీ వాహనాల శబ్దానికి ఇబ్బంది పడే అవకాశం ఉంది కనుక ఈ సఫారీ వాహన సేవలను 90 రోజులపాటు ప్రతి సంవత్సరం నిలిపి వేస్తారు. ఇప్పటివరకు అమ్రాబాద్ అభయారణ్య ప్రాంతంలో 32 కు పైగా పెద్ద పులులు 180 కి పైగా చిరుతపులులు 2200 పైగా ఇతర వన్యప్రాణులు ఉన్నట్లు అటవీ శాఖ నివేదికలు తెలుస్తున్నాయి. భారత దేశంలోనే అతిపెద్ద అభయారణ్యంగా అమ్రాబాద్ పులులకు అత్యంత సురక్షిత ప్రాంతంగా ఉందని ఈ మధ్యకాలంలో వన్యప్రాణుల యొక్క సంఖ్య భారీగా పెరిగిందని తెలుస్తుంది. అయితే జులై 1 నుండి అక్టోబర్ 30 వరకు అడవిలో పర్యటములకు గాని ఎలాంటి అనుమతి లేదు ఒకవేళ అభయారణ్యంలోకి మనుషులు ప్రవేశించినట్లయితే వైల్డ్ లైఫ్ ఆక్ట్ ప్రకారం శిక్ష అర్హులు అని రోహిత్ గోపి తెలిపారు. శ్రీశైల రహదారిపై వందల సంఖ్యలో వాహనాలు వెళ్లి ధ్వని కాలుష్యాన్ని వాతావరణ కాలుష్యాన్ని కలిగిస్తున్నాయి. కానీ అభయారణ్యంలోపల జంతువుల సంతానోత్పత్తికి ఎలాంటి ఇబ్బంది ఉన్న వాటి ఏకాంతానికి భంగం కలుగుతుందని ప్రతిరోజు ఉదయం 6 గంటల కు మన్ననూర్ చెక్పోస్టు దోమల పెంట చెక్పోస్ట్ ఓపెన్ చేసి వాహనాలకు అనుమతి ఇస్తారు అలాగే రాత్రి 9 గంటల సమయంలో రెండు చెక్పోస్ట్లను బందు చేసి వాహన రాకపోకలను నిలిపివేస్తారు.

Leave A Reply

Your email address will not be published.