- తుంగతుర్తి రైతు సేవా సహకార సంఘం సీఈవో వందనం వెంకటేశ్వర్లు పదవి విరమణ.
- ఘనంగా సన్మానించిన సహకార సంఘ చైర్మన్ డైరెక్టర్లు సిబ్బంది రైతాంగం.
తుంగతుర్తి, ముద్ర: గత 42 సంవత్సరాలుగా ఒకే కార్యాలయంలో ఉద్యోగం నిర్వహిస్తూ అదే కార్యాలయంలో రిటైర్మెంట్ పొందడం అరుదైన సంఘటనగా చెప్పవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం కార్యాలయంలో 1984 సంవత్సరంలో క్లర్క్ గా ఉద్యోగాన్ని పొందిన వందనం వెంకటేశ్వర్లు అంచలంచెలుగా ప్రమోషన్లు పొందుతూ సోమవారం పదవీ విరమణ పొందారు .సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా సహకార సంఘం రాజకీయంగా వివిధ పార్టీల చైర్మన్లు అయినప్పటికీ అందరి మన్ననలను పొందుతూ అనేక ప్రమోషన్లు పొందుతూ 2025 లో పదవీ విరమణ పొందే నాటికి సీఈఓ గా పనిచేసి పదవి విరమణ పొందారు. రైతులతో మమేకమై ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కలిగి ఉండి ఏ చైర్మన్ వచ్చినా ఆచైర్మన్కు తలలో నాలుక లాగా ఉండి కార్యాలయానికి చెడ్డ పేరు రాకుండా ఎలాంటి మచ్చ లేకుండా అవినీతికి తావు లేకుండా ఉద్యోగాన్ని నిర్వహిస్తూ పదవీ విరమణ పొందడం పట్ల తుంగతుర్తి మండలం లోని వివిధ గ్రామాల రైతాంగం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వందనము వెంకటేశ్వర్ల సేవలను యావత్ రైతాంగం కొనియాడుతుంది .ఎంతోమంది చైర్మన్ల వద్ద పనిచేసిన అదే గౌరవంతో ఆ చైర్మన్ పదవీకాలం పూర్తయ్యేంతవరకు కొనసాగుతూ కొత్త చైర్మన్ వచ్చినప్పటికీ సహకార సంఘంలో ఒకే తీరు పనిని చేస్తూ ముందుకు సాగిన ఘనత వందనం వెంకటేశ్వర్లకి దక్కిందని పలువురు మాజీ చైర్మన్లు సైతం కొనియాడారు.ఈ సందర్భంగా తుంగతుర్తి మండల కేంద్రంలో ని రైతు సేవా సహకార సంఘం కార్యాలయంలో ప్రస్తుత సహకార సంఘం చైర్మన్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు తోపాటు డైరెక్టర్లు సిబ్బంది వందనపు వెంకటేశ్వర్లను ఘనంగా సన్మానించారు.చివరిసారిగా ఆయన కుర్చీలో కూర్చోబెట్టి సన్మానించిన తీరు తో వందనం వెంకటేశ్వర్లు ఉద్వేగానికి గురయ్యారు. అనంతరం స్థానిక సిరి ఫంక్షన్ హాల్ లో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు గ్రామస్తులు వివిధ శాఖల ఉద్యోగులు వందనము వెంకటేశ్వర్లు ఘనంగా సన్మానించారు.గతంలో పనిచేసిన ఏఉద్యోగి కూడా ఇంత ఘనమైన సన్మానం జరగలేదని పలువురు వక్తలు కొనియాడారు. ఏది ఏమైనా 42 సంవత్సరాలు ఒకే కార్యాలయంలో పనిచేసే అదే చోట పదవి విరమణ పొందడం మరుపురాని జ్ఞాపకమని పలువురు అభిప్రాయపడుతున్నారు. వందనం వెంకటేశ్వర్లు తన శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో గడపాలని పలువురు వక్తలు అన్నారు.ఈ కార్యక్రమంలో అనేకమంది రైతులు పాల్గొన్నారు.
