Take a fresh look at your lifestyle.

6 నుండి హెల్త్ వీక్- కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్:
హెల్త్ వీక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 6 నుండి 11 వరకు వారం రోజులపాటు హెల్త్ వీక్ కార్యక్రమాన్ని అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు. హెల్త్ వీక్ కార్యక్రమంలో భాగంగా జిల్లా, గ్రామీణ స్థాయిలో ప్రజలందరి భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు.
ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని సాధించవచ్చని, మహిళలు చిన్న పిల్లల అనారోగ్య సమస్యలపై యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు.
వివిధ వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేసినవారిని తిరిగి చికిత్సను అందించాలన్నారు. ఎయిడ్స్, క్యాన్సర్, హైరిస్క్ ప్రెగ్నెన్సీ, సి సెక్షన్, ఎనీమియా , మత్తు పదార్థాల నిర్మూలన,లాంటి అనేక వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఆరు రోజుల కార్యక్రమాలకు నోడల్ ఆఫీసర్లను నియమించాలన్నారు. ఈట్ రైట్, ఎయిడ్స్ పై అవగాహన, యోగ సేవ్, మదర్స్ డే, లాంటి కార్యక్రమాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు. సోమవారం
మున్సిపల్ కార్యాలయం నుంచి రాందాస్ చౌరస్తా వరకు వాక్ కొనసాగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, డిసిహెచ్ శివదయాల్, జిల్లా విద్యాధికారి విజయ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, డీఎస్పీ ప్రసన్నకుమార్, డ్రగ్స్ నియంత్రణ అధికారి చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.