Take a fresh look at your lifestyle.

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతోత్సవ వేడుకలు- జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఈనెల 5వ తేదీన ఆదివారం ఉదయం 9.00 గంటలకు ఆర్ అండ్ బి కార్యాలయం పక్కన గల డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహి స్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య శనివారం ఓక ప్రకటనలో తెలిపారు.జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని నటరాజ్ థియేటర్ పక్కన,కల్వకుంట రోడ్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈకార్యక్రమానికి ప్రజాప్రతినిధులు,అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు,బడుగు,బలహీన వర్గాల నాయకులు,ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.