Take a fresh look at your lifestyle.

ఎస్‌ఎస్‌సి,ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: అడిషనల్ కలెక్టర్ పాండు

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
ఏప్రిల్/మే 2026లో నిర్వహించనున్న ఎస్‌ఎస్‌సి మరియు ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ (TOSS) పబ్లిక్ పరీక్షలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేపట్టాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ పాండు ఆదేశించారు.శనివారం అదనపు కలెక్టర్ అధ్యక్షతన ఆయన ఛాంబర్‌లో ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా అదనపు కలెక్టర్ పరీక్షల నిర్వహణలో ఎటువంటి అంతరాయం లేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్షించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ,ప్రతి శాఖ సమన్వయంతో పని చేసి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, భద్రత, మెడికల్ కిట్ వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని తెలిపారు.ప్రశ్నపత్రాల రవాణా, భద్రతా ఏర్పాట్లు, పర్యవేక్షణ బృందాల నియామకం,పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్ నియంత్రణపై సంబంధిత శాఖలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ముందస్తుగా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు,సెల్‌ఫోన్లు అనుమతించకూడదని ఆదేశించారు.ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్ (TOSS) పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 20 నుండి 27 వరకు నిర్వహించబడతాయనీ, ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని, ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించబడతాయని,
జిల్లాలో మొత్తం 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని,అందులో ఎస్‌ఎస్‌సి పరీక్షలకు 10 కేంద్రాలు, ఇంటర్మీడియట్ పరీక్షలకు 18 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ వెంకటస్వామి తెలిపారు. ఎస్‌ఎస్‌సి పరీక్షలకు 2,692 మంది విద్యార్థులు, ఇంటర్మీడియట్ పరీక్షలకు 5,065 మంది విద్యార్థులు హాజరుకానున్నారని
తెలిపారు.ఈసమావేశంలో విద్య,పోలీస్,పోస్టల్, టీజీఆర్‌టీసీ,వైద్య ఆరోగ్య, ట్రాన్స్‌కో,ఆర్డబ్ల్యూఎస్, ఇంటర్మీడియట్ రవాణా శాఖల అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.