Take a fresh look at your lifestyle.

ఘనంగా స్వాతంత్ర సమరయోధుడు దొడ్డి కొమరయ్య జయంతి

 

ముద్ర : కాప్రా

మల్లాపూర్ డివిజన్‌లో దొడ్డి కొమరయ్య జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి తాడూరి శ్రీనివాస్ హాజరై పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దొడ్డి కొమరయ్య జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు అయిన దొడ్డి కొమరయ్య ఆశయాలు సమాజానికి ఎంతో ప్రేరణనిచ్చే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రస్తుత యువత దొడ్డి కొమరయ్య సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.