Take a fresh look at your lifestyle.

రూ.80 కోట్ల అంచనా వ్యయం తో నాలా విస్తరణ పనులకు శంకుస్థాపన లు చేసిన గాంధీ

మాదాపూర్, ముద్ర విలేఖరి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారానగర్ కాలనీ లో గల సాయి బాబా దేవాలయం వద్ద రూ.28 కోట్ల 45 లక్షల రూపాయలతో నల్లగండ్ల చెరువు అలుగు నుండి బి. హెచ్. ఈ. ఎల్ చౌరస్తా గ్యాస్ గో డౌన్ నాల వరకు నాల విస్తరణ పనులలో భాగంగా నిర్మిస్తున్న ఆర్. సి. సి బాక్స్ డ్రైన్ నిర్మాణం పనులను, ఆర్. సి. సి బెడ్, సైడ్ వాల్స్ నిర్మాణం మరియు నాల విస్తరణ నిర్మాణం పనులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, అధికారులతో కలిసి పరిశీలించిన పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ.ఈ సందర్భంగా పీయేసీ చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఎస్. ఎన్.డి. పి రెండవ ఫేస్ లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రూ.79 కోట్ల 58 లక్షల రూపాయల అంచనా వ్యయం తో నాలల విస్తరణ పనులు చేపట్టడం తో ఎన్నో ఏండ్ల వరద ముంపు సమస్య కు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దానిలో భాగంగా తారా నగర్ కాలనీలో గల సాయి బాబా దేవాలయం వద్ద రూ.28 కోట్ల 45 లక్షల రూపాయలతో నల్లగండ్ల చెరువు అలుగు నుండి బి. ఎచ్. ఇ. ఎల్ చౌరస్తా గ్యాస్ గో డౌన్ నాల వరకు నాల విస్తరణ పనులు మరియు బాక్స్ డ్రైన్ నిర్మాణం పనులు, బెడ్, సైడ్ వాల్స్ నిర్మాణం మరియు నాల విస్తరణ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, నాలా విస్తరణ పనులకు అందరూ సహకరించాలని, ఒక్కప్పుడు వరదలు వస్తే కంటి మీద కునుకు లేకుండా ప్రజలు తీవ్ర ఆందోళన తో ఇబ్బందులకు గురయ్యేవారని, కానీ నేడు సమస్య పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగినది అని, ఈ రోజు పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని,నాలల విస్తరణ పనులతో లోతట్టు, ముంపు ప్రాంతాలకు ఉపశమనం లభించింది అని ప్రజా అవసరాల దృష్ట్యా ప్రథమ ప్రధాన్యత లో విస్తరణ పనులు చేపట్టాలని, నాలల విస్తరణ పనులలో వేగం పెంచాలని, యుద్ధప్రాతిపదికన పనులుప్రారంభించాలని, అధికారులకు చైర్మన్ గాంధీ సూచించారు.ఈ కార్యక్రమంలో అధికారులు ధీరజ్, నిఖిల్ యుగేందర్, పవన్ మరియు, నాయకులు, కార్యకర్తలు తదితర స్థానిక కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.