Take a fresh look at your lifestyle.

పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ని డివిజన్ లో ప్రచారం చేస్తున్న మంత్రి దామోదర రాజానర్సింహా

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………..
రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో మున్సిపాలిటీ లోని 1వ , 6వ , 50వ , 51వ , 60 వ డివిజన్ లలో పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులతో పాదయాత్రగా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేపట్టారు.కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు , పార్టీ శ్రేణులకు వివరించారు . ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత పార్టీలకు అతీతంగా రేషన్ కార్డులను ఇచ్చామన్నారు . సన్నబియ్యం , ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ కే దక్కిందన్నారు.మహిళ సాధికారతే లక్ష్యంగా మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాలను అందిస్తున్నామన్నారు . పాలమూరు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు . మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని కార్యకర్తలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపునిచ్చారు . భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ప్రచారంనిర్వహించారు . ఎన్నికల ప్రచారం లో భాగంగా మహబూబ్ నగర్ లోని ఏనుగొండ , అంబేద్కర్ చౌరస్తా , పాత పాలమూరు చౌరస్తా కూడళ్ల లో కార్యకర్తలతో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. 60 డివిజన్ లలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలను , పార్టీ శ్రేణులను కోరారు.ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు సంజీవ్ కుమార్,జడ్చర్ల శాసన సభ్యులు అనిరుధ్ రెడ్డి , మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ , మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, సంజీవ్ , డా . రాజీవ్ , మిథున్ రెడ్డి , పార్టీ ముఖ్య నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.