Take a fresh look at your lifestyle.

బీసీ రిజర్వేషన్ల పేరుతో మైనారిటీ లకు లాభం చేకూరుస్తారా

  • భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు.

కోరుట్ల, ముద్ర విలేకరి: కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ పేరుతో బీసీలను మోసం చేస్తుందని, దీనిని బీసీలందరూ గమనించి 10 శాతం ఇచ్చే రిజర్వేషన్ బీసీలకు కాదని మైనారిటీల కోసం బీసీలను పావుగా వాడుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు ప్రశ్నించారు. బుధవారం కోరుట్ల పట్టణం లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆగస్టు రెండున జరిగే బిజెపి ఆధ్వర్యంలో బిసి నాయకులకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు మహా ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు బిసిలందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో అధికంగా ఉన్న బీసీలు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన సర్వేలో ఎలా తక్కువ అయ్యారని ప్రశ్నించారు. గతం లో 56 శాతం ఉండగా ఇప్పుడు 45 శాతం కు ఎలా తగ్గిపోయారని అన్నారు. బీసీలపై సవతి తల్లి ప్రేమ మాదిరి అబద్ధపు అసత్యపు ప్రచారాలతో 42 శాతం ఇస్తానని ఇప్పుడు అందులో 10 శాతం మైనారిటీ లను కలపడం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఎలా అవుతుందని మంది పడ్డారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ నాయకులందరూ కులాల కతీతంగా పార్టీల కతీతంగా వ్యతిరేకించవలసిన సమయం ఆసన్నమైందని ఇలాంటి చౌకబారు ఆరోపణలు మానుకొని బీసీలను అమాయకులని మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు రుద్ర శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి ఎర్ర రాజేందర్, ఇందూరి తిరుమల వాసు, తాజా మాజీ కౌన్సిలర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాడవేణి నరేష్, పెండేమ్ గణేష్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు కలల చందూ భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.