Take a fresh look at your lifestyle.

నేటినుంచి “ఆకాంక్ష హ్యాట్” హస్తకళా ప్రదర్శన

  • అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్.

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఈ నెల 31 నుంచి ప్రారంభం “ఆకాంక్ష హ్యాట్” పేరిట హస్తకళల ప్రదర్శన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు.నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ భవనంలో ఈ కార్యక్రమం నీతి ఆయోగ్ ఆకాంక్ష హ్యాట్ కార్యక్రమాలలో భాగంగా నిర్వహించబడుతుందని తెలిపారు.ఆగస్టు 4వ తేదీ వరకు 5 రోజుల పాటు జరుగనున్న ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు స్వయంగా తయారు చేసిన హస్తకళల ఉత్పత్తులను ప్రదర్శించి, విక్రయించనున్నారని తెలిపారు.కార్యక్రమ ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్, ఖానాపూర్ శాసనసభ్యులు, జిల్లా అధికారులు, ఇతర విశిష్ట అతిథులు హాజరవుతారన్నారు. గతంలో పెంబి మండలంలో నిర్వహించిన నీతి ఆయోగ్ ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమంలో హెల్త్ అండ్ న్యూట్రిషన్ విభాగంలో ప్రదర్శించిన అత్యుత్తమ సేవలకు గాను జాతీయ స్థాయిలో కాంస్య పతకం లభించిందని అదనపు కలెక్టర్ తెలిపారు. దీనిని పురస్కరించుకుని రేపటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంస్య పతక విజేతలైన పెంబి మండల అధికారులు, ఎఎన్ఎం లు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడి టీచర్లు, స్వయం సహాయక మహిళలు. ఇతర ఫ్రంట్‌లైన్ సిబ్బందిని జిల్లా స్థాయిలో సన్మానించనున్నట్టు వెల్లడించారు.ఈ ఘనత జిల్లాకు గర్వకారణమని, వారి సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయిలో జరగబోయే ప్రశంసా కార్యక్రమంలో జిల్లా ప్రతినిధులు పాల్గొననున్నారని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని కోరుతూ, జిల్లా ప్రజలు హస్తకళల ప్రదర్శనను ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.