- మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ
- పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం
- రాష్ట్రం నుంచి ఇద్దరికి
- ఏపీ నుంచి నలుగురికి
ముద్ర, తెలంగాణ బ్యూరో : రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేషమైన సేవలందించిన పలువురు వ్యక్తులకు పద్మ పురస్కారాలను ప్రదానం చేయనుంది. వీరిలో తెలంగాణకు చెందిన దువ్వూరి నాగేశ్వర్‌రెడ్డికి పద్మ విభూషణ్ వరించింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగకు పద్మ శ్రీ వరించింది. మరో వైపు కళల విభాగంలో ఏపీ నుంచి నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ ప్రకటించారు.
దువ్వూరు నాగేశ్వర్‌రెడ్డి
కర్నూలు మెడికల్ కాలేజీలో చదివిన భారతీయ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. దువ్వూరు నాగేశ్వర్‌రెడ్డి. ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రి అయిన హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఛైర్మన్ మరియు వ్యవస్థాపకుడు. ఆయనకు 2002లో పద్మశ్రీ అవార్డు, 2016లో పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. ఇప్పుడు పద్మ విభూషణ్‌తో కేంద్ర సత్కరిస్తున్నది. అంతకు ముందు 2013 సెప్టెంబర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో చైనాలోని షాంఘైలో ప్రపంచంలోని అత్యున్నత గ్యాస్ట్రో ఎంటరాలజీ అవార్డును అందుకున్నాడు.
మంద కృష్ణ మాదిగ
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ వరంగల్ జిల్లా హంటర్‌రోడ్డు శాయంపేటలో జన్మించారు. 14 మంది యువకులతో ప్రారంభమైన దండోరా.. ఒక చిన్న గ్రామం ఈదుమూడి , ప్రకాశం జిల్లా నుండి మొదలై రాష్ట్రంలో ఉన్న ప్రతి మాదిగ గూడెంలో దండోరా జెండా ఎగిరే విధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కృషి చేసింది. మాదిగ ఉప కులాలు విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక సామజిక అంశాలలో స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 50 ఏండ్ల అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న కులం మాదిగ కులం అనే నినాదంతో మంద కృష్ణ మాదిగ ఉద్యం చేశారు. ఎస్సీ రిజర్వేషన్స్ ఎస్సి కులాల జనాభా నిస్పతి ప్రకారం విభజించి, దళితుల్లో అత్యదికంగా వెనుకబడిన కులాలకు న్యాయం చెయ్యాలనే డిమాండ్ తో దండోరా ఉద్యమం మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో ముందుకు వచ్చింది.
అణగారిన కులాల ఆత్మగౌరవం, సమన్యాయం పంపిణి విలువల కేంద్రంగా బయలుదేరిన దండోరా ఉద్యమం అనతికాలం లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన ఉద్యమం సంస్థగా ఎదిగి, అణగారిన కులాల గొంతుకగా నిలిచింది. ఒక ప్రవాహంగా ప్రజాక్షేత్రంలో దండోరా ఉద్యమం తెచ్చిన కొత్త చైతన్యం అనేక ప్రజా ఉద్యమాలకు ఆదర్శంగా నిల్చింది. ఈ ఉద్యమానికి మంద కృష్ణ మాదిగ చేసిన పోరాటానికి కేంద్రం పద్మశ్రీ ప్రకటించింది.ఏపీ నుంచి ఈసారి ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ దక్కింది. మాడగుల నాగఫణీశర్మకు పద్మ శ్రీ వచ్చింది. ఏపీ నుంచి మొత్తం ఐదుగురికి పద్మ అవార్డులు వరించాయి.
తెలంగాణ నుంచి
దువ్వూరు నాగేశ్వర్‌రెడ్డి మెడిసిన్ పద్మ విభూషణ్
మంద కృష్ణ మాదిగ సామాజికం పద్మ శ్రీ
ఏపీ నుంచి
నందమూరి బాలకృష్ణ కళలు పద్మ భూషణ్
కేఎల్ కృష్ణ లెక్చరర్, ఎడ్యుకేషన్ పద్మ శ్రీ
మాడుగుల నాగఫణీ శర్మ కళలు పద్మశ్రీ
మిర్యాల అప్పారావు కళలు పద్మశ్రీ
వద్దిరాజు రాఘవేంద్రచార్య పంచముఖి లెక్చరర్ ఎడ్యుకేషన్ పద్మశ్రీ