నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. 76వ రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా.. నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సిక్రిందాబాద్ పరేడ్ గ్రాండ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు, సాయంత్రం రాజ్‌భవన్ వేదికగా జరిగే ఎట్ హోం కార్యక్రమం దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ సీపీ వెల్లడించారు. నేడు ఉదయం 7.30గంటల నుంచి 11.30 గంటల వరకు సిక్రిందాబాద్ పరేడ్ గ్రౌండ్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అన్నారు. ఎట్ హోం నేపథ్యంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రాజ్ భవన్ పరిధిలో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలిపారు.
బంజారాహిల్స్, పంజాగుట్ట, గ్రీన్‌ల్యాండ్స్, ప్రశాంత్ నగర్, బేగంపేట, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ రూట్లలో వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో ప్రయాణాలు సాగించాలని సూచించారు. సిక్రిందాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో రిపబ్లిక్ డే వేడుకల సమయంలో టివోలీ ఎక్స్ రోడ్స్, ప్లాజా ఎక్స్ రోడ్స్ మార్గాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ట్రైన్ ప్రమాణికులు ముందుగానే బయలుదేరి రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలని సూచించారు. ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా.. వాహనదారులు సహకరించాలని, ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు.