Take a fresh look at your lifestyle.

మాజీ ఏమ్మెల్యే మర్రి బర్త్ వేడుకల్లో అత్యుత్సాహం- కేసులు నమోదు చేసిన పోలీసులు

 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్: మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా అనుమతులు లేకుండా విద్యుత్ స్తంభాలపై ఫైర్ క్రాకర్లు అమర్చి కాల్చి ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే విధంగా ప్రవర్తించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రవీణ్, వెంకటేష్, భాస్కర్ గౌడ్‌లపై చర్యలు తీసుకున్నారు.

అలాగే అదే జన్మదిన వేడుకల సందర్భంగా రోడ్డును దిగ్బంధం చేసి ప్రజా రవాణాకు అంతరాయం కలిగించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన విష్ణు, నరసింహ, శ్రీశైలం, భాస్కర్ గౌడ్, తిమ్మాజీపేట పాండు, ఇంద్రకల్ రమణ తదితరులపై కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌ఐ కె. గోవర్ధన్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.