ముద్ర ప్రతినిధి, భువనగిరి :
బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం చింతల యువసేన, ఆయన అభిమానుల ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అనంతరం రాయగిరిలోని సహృదయ అనాధ వృద్ధ ఆశ్రమంలో వృద్ధులకు మధ్యాహ్న భోజన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వలపు విజయ్, దండబోయిన బలరాజ్ యాదవ్, గాజుల నవీన్, పల్లెపాటి రవికుమార్, ఎలిమినేటి మహేంద్ర రెడ్డి, దోషపాటి హరీష్, కూదే శ్రీశైలం, మోతే మనోహర్, నాగారం నరేష్, చింతల యువసేన నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
