- 581 మార్కులు సాధించిన బి.పర్ణికకు సన్మానం.
ధర్మపురి, ముద్ర: పదవ తరగతి ఫలితాలలో శ్రీ గ్లోబల్ హైస్కూల్ బుగ్గారం విద్యార్థులు చట్ట మనిoద్ర 511 మార్కులతో ఉత్తమ సాధించారు.అద్భుత ఫలితాలు సాధించినందుకు పాఠశాల ప్రిన్సిపల్ డా. నక్కరాజు విద్యార్థులను పుష్పగుచ్చం అందించి అభినందించారు.ఈ సందర్భంగా నక్క రాజు మాట్లాడుతూ చదువులలో అమ్మాయిలు మాత్రమే పై చేయి సాధిస్తున్న ప్రస్తుత కాలంలో అబ్బాయిలు కేవలం సెల్ ఫోన్, చెడు వ్యసనాలకు దగ్గరవుతున్న ప్రస్తుత పరిస్థితులలో ఎనిమిది మంది బాలురులు ఐదు వందలకు పైచిలుకు మార్కులు సాధించడం అభినందనీయమన్నారు. అలాగే జగిత్యాల లోని అక్స్ ఫర్డ్ హైస్కూల్లో చదివిన బి. పర్ణిక 581 మార్కులు సాధించి పాఠశాల పేరు నిలబెట్టింది. స్కూల యాజమాన్యం తో పాటు పేరెంట్స్ డాక్టర్, సృజన అభినందించారు.