ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
బర్రెలను అపహరించే కూతురు దొంగలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు భువనగిరి సబ్ డివిజన్ డిఎస్పి రవీందర్, రూరల్ సీఐ చంద్రబాబు తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో సిఐ మాట్లాడుతూ ఈ నెల 12న మండలంలోని బొల్లేపల్లి గ్రామానికి చెందిన గొర్ల సత్తయ్య కు చెందిన ఒక బర్రె ను గుర్తుతెలియని దొంగలు దొంగిలించుకొని వెళ్లినారనే ఫిర్యాదు మేరకు భువనగిరి రూరల్ పోలీస్ వారు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేసినట్లు చెప్పారు. మరుసటి 13న పిన్నిoటి భగవంత్ రెడ్డి కు చెందిన మరొక బర్రె దొంగిలించబడిందని పిర్యాదు రాగా దర్యాప్తులో భాగంగా భువనగిరి రూరల్ పోలీస్ వారికి గజ్వేల్ లో దొంగలించిన బర్లను అమ్ముటకు ప్రయత్నిస్తున్నారని సమాచారం అందినట్లు చెప్పారు. వెంటనే భువనగిరి రూరల్ పోలీస్ యస్ ఐ, క్రైమ్ సిబ్బంది తో కలిసి గజ్వేల్ వెళ్ళి వారిని పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వచ్చి విచారించగా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామానికి చెందిన షేక్ మహబూబ్, తుర్కపల్లి మండలం చిన్న లక్ష్మాపురం గ్రామానికి చెందిన పోతిరెడ్డి మల్లారెడ్డి, తుర్కపల్లి గ్రామానికి చెందిన ధరావత్ హట్టు అని చెప్పారు. వీరిలో మహబూబ్ అనే వ్యక్తి కర్కపట్ల లోని ఒక ప్రైవేటు కంపనిలో పని చేస్తూ, అదే కంపెనీ లో పని చేస్తున్న పోతిరెడ్డి మల్లారెడ్డి తో పరిచయం పెంచుకొని వీరిద్ధరు కలిసి బర్ల దొంగతనం చేయాలని నిర్ణయించుకొని, దొంగతనం చేసిన బర్లను వీరికి తెలిసిన నాగాయపల్లి తాండకు చెందిన బర్ల వ్యాపారి ధరావత్ హట్టు కి అమ్మాలని నిర్ణయించుకొని విషయాన్ని హట్టు కి తెలపగా అతను సరే అని చెప్పగా, వారిద్దరూ దొంగతనాలకు పాల్పడ్డారని అన్నారు. మొదటగా జనవరి నెలలో బీబీనగర్ మండలం గూడూరు గ్రామ శివారులో ఒక బర్రె , దూడని, రెండవసారి ఏప్రిల్ నెలలో బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామ శివారులో ఒక బర్రెను, మూడవసారి అదే నెలలో బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామ శివారులో ఒక బర్రెను, నాలుగోసారి అదే నెలలో బీబీనగర్ గ్రామ శివారులో ఒక బర్రెను, ఐదవసారి మే నెలలో బీబీనగర్ మండలం లోని జమీలాపేట గ్రామ శివారులో ఒక బర్రెను, ఇలా పలు దఫాలుగా బీబీనగర్ మండల పరిధిలో మొత్తం 5 బర్రెలు, ఒక దూడను దొంగతనం చేయగా బీబీనగర్ పి యస్ లో కేసులు నమోదయాయ్యన్నారు. మే నెల మొదటి వారంలో వలిగొండ మండలం లోని అర్రూరు గ్రామ శివారులో రెండు బర్రెలను, తరువాత అదే నెలలో వలిగొండ మండలం లోని టేకుల సోమారం గ్రామ శివారులో ఒక బర్రెను, ఇలా పలు దఫాలుగా వలిగొండ మండల పరిధిలో మొత్తం 3 బర్రెలు దొంగతనం చేయగా వలిగొండ పి యస్ లో కేసులు, భువనగిరి రూరల్ పి యస్ పరిధి లోని బొల్లేపల్లి, నాగిరెడ్డిపల్లి గ్రామాలలో రెండు బర్రెలను దొంగతనం చేశారని తెలిపారు. ఇలా మొత్తం పది బర్రెలు, ఒక దూడను దొంగిలించిన్నట్లు పై ముగ్గురు వ్యక్తులు దొంగిలించిన బర్రెలను గజ్వేల్ లో అమ్ముతుండగా మేము వారిని పట్టుబడి చేసి విచారించగా నేరం అంగీకరించారు. నేరస్తుల వద్ద నుండి పది బర్రె లు, ఒక దూడ స్వాధీనం చేసుకోని నేరస్తులను జ్యుడీషియల్ రిమాండ్ కు పంపడం జరిగిందన్నారు. ఈ కేసులో కృషి చేసిన భువనగిరి రూరల్ ఎస్ ఐ శివ శంకర్ రెడ్డి, క్రైమ్ హెడ్ కానిస్టేబుల్ నారాయణరెడ్డి, కానిస్టేబుళ్ళు నరేందర్, చెన్నకేశవులు, సీడీఆర్ ఎనాలిసిస్ కానిస్టేబుల్ హరీష్, ఇన్వెస్టిగేషన్ లో సహకరించిన స్టేషన్ రైటర్స్ హెడ్ కానిస్టేబుల్ అశోక్ రెడ్డి, కానిస్టేబుల్ లింగస్వామి ని అభినందించారు.