ముద్ర, కోరుట్ల;
భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా పార్టీ ఆధ్వర్యంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం కోసం స్థలం కేటాయించాలని శనివారం రోజు నిరసన కార్యక్రమానికి పిలుపు ఇవ్వగా రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఉన్న కథలాపూర్ మండల అధ్యక్షులు మల్యాల మారుతి, నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి కథలాపూర్ పోలీస్ స్టేషనకి తరలించడాన్ని మారుతి తీవ్రంగా ఖండించారు. అయన మాట్లాడుతూ ఈ చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకుంటే బీజేపీ ఎపుడు ముందుండి ప్రజల పక్షాన ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల కోసం పోరాడే బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం సిగ్గు చేటని అయన అన్నారు.