Take a fresh look at your lifestyle.

నేడు విజయోత్సవ సభ

  • ఏర్పాట్లను పరిశీలించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల.

ముద్ర, తెలంగాణ బ్యూరో: రైతు భరోసా విజయోత్సవ సభ ను నేడు సచివాలయం ఎదురుగా గల రాజీవ్ గాంధీ విగ్రహ ఆవరణలో నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ, సహకార,మార్కెటింగ్ జోళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్ ముందు గల రాజీవ్ విగ్రహం ఆవరణ ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం రైతు భరోసా విజయోత్సవం సభ నేపథ్యంలో చేపట్టబోయే ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వివిధ శాఖల అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విజయోత్సవ సభకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు సహచర మంత్రులు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.రాష్ట్రంలో రైతాంగానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, తెలంగాణ రైతులను రాజులుగా చూడాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని అన్నారు. రైతుల వ్యవసాయ పనులకు తొలకరికి ముందుగానే రైతు భరోసాను తొమ్మిది రోజులలో రూ. 9 వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాలో జమ చేయడం జరిగిందని స్పష్టం చేశారు.దేశంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రైతులకు రూ. 70 వేల కోట్లు రుణమాఫీ జరిగితే తెలంగాణలో ఇప్పుడు 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ కింద రూ. 21 వేల కోట్లు చెల్లించటం జరిగిందని అన్నారు. ఇట్టి కార్యక్రమానికి అన్ని జిల్లాల నుండి రైతు భరోసా పొందిన లబ్ధిదారులు పాల్గొననున్నారని , కార్యక్రమం ఏర్పాట్లు ఎక్కడ కూడా లోపాలు లేకుండా, రైతులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని మంత్రి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.విద్యుత్, త్రాగునీరు, షామియానాలు, సీటింగ్ కెపాసిటీ, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ తదితరు అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో అధికారులకు కలిసి దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, ప్రిన్సిపల్ సెక్రెటరీ అహమ్మద్ నదీమ్, హైదరాబాద్ కమిషనర్ పోలీస్ సివి ఆనంద్, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్స్ ఎంఎం భగవ త్, ట్రాన్స్పోర్ట్ శాఖ కమిషనర్ సురేందర్ మోహన్, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్,,= ఐ అండ్ పి ఆర్ కమిషనర్ సిహెచ్ ప్రియాంక, ఉద్యాన శాఖ కమిషనర్ యాస్మిన్ భాష, ఎస్ పిడిసిఎల్ ఎండి ముష్రాఫ్ అలీ, వ్యవసాయ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.