Take a fresh look at your lifestyle.

తెలంగాణ జాగృతి రాజకీయ పోస్టర్ ఆవిష్కరణ

 

ముద్ర మల్కాజిగిరి

మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ రాజకీయ పోరాట ప్రకటన సభకు సంబంధించిన పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సంస్థ నాయకురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వం వహిస్తున్నారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల హక్కుల సాధన, ప్రజా సమస్యల పరిష్కారం, మహిళా సాధికారత కోసం కవిత నిరంతరం పోరాటం చేస్తున్నారని అన్నారు. రానున్న సభ తెలంగాణ ప్రజల గొంతుకగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏప్రిల్ 25న ఉదయం 8 గంటలకు మెడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అడ్వయ కన్వెన్షన్ హాల్ లో ఈ మహాసభ జరగనుంది. మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి సీనియర్ నాయకులు, ప్రశాంత్ చారి (ఇన్‌చార్జ్), ఈగ సంతోష్, లలితా యాదవ్, భవాని వేముల, సంధ్యా రెడ్డి, నవీన్ యాదవ్, రజిత, సాయి,మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.