Take a fresh look at your lifestyle.

జగిత్యాలలో ఘనంగా కళాశ్రీ ఉగాది పురస్కారాలు… పలువురు కళాకారులకు పురస్కారాలు అందజేత..

 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం జగిత్యాల అధినేత గుండేటి రాజు ఆధ్వర్యంలో స్థానిక దేవిశ్రీ గార్డెన్స్ లో నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర కళాశ్రీ ఉగాది పురస్కారాల కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన విశిష్ట ప్రతిభావంతులైన ప్రముఖులకు కళాశ్రీ ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు. యూ ట్యూబ్ ఫేం కోడి శ్రీను, రూప, పోషవ్వ హస్యవల్లరి, మల్లేష్ ఒగ్గు కథ, గాయకులు అభి, దేవేందర్, కృష్ణవేణి వంగ పాటల విభావరి ప్రేక్షకులను అలరించింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అయిత అనిత, రుద్రాంగి గోపాల కృష్ణ, సూర్యం, ఎ. వి.ఎన్ రాజు, సంకోజి వెంకట రమణ, మద్దెల సరోజన, ఉజగిరి జమున, లక్కరాజు శ్రీ లక్ష్మీ, కటుకం కవిత, ఓదెల గాంగధర్, పెండెం మహేందర్, గుండేటి బేబి రాణి, బోగ ఉమారాణి, బుర్ర శ్యామల, గెటప్ శ్రీను, శ్రీరామోజ్ సంగీత, సింగం పద్మ, సవిత కంకటి, ముత్యపు భాగ్యలక్ష్మి, రచన, మద్దెల ప్రభాకర్, అమర్నాథ్ రెడ్డి, ఆనంద రావు, కందుకూరి నాగరాజు, బుసారపు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.