Take a fresh look at your lifestyle.

కొడంగల్ కు సమానంగా నల్గొండ కు నిధులివ్వండి సీఎం రేవంత్ కు మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి

కొడంగల్ కు సమానంగా నల్గొండ కు నిధులివ్వండి
సీఎం రేవంత్ కు మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి
వచ్చే ఎన్నికల్లో ఉత్సాహం ఉంటేనే తాను పోటీ చేస్తా
ముద్ర, నల్గొండ :

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌తో సమానంగా నల్గొండకు నిధులు ఇవ్వాలని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నల్గొండను అభివృద్ధి పథంలో నడిపించాలన్నదే తన లక్ష్యమన్నారు. నల్గొండ పట్టణంలోని బొట్టుగూడలో కోమటిరెడ్డి ప్రతీక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అత్యాధునిక వసతులతో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సీఎంగా రేవంత్ రెడ్డి పాలన తీరు బాగుందన్నారు. అయితే అభివృద్ధిలో వెనకబడిన నియోజకవర్గాలకూ తన సొంత నియోజకవర్గం మాదిరిగానే నిధులు విడుదల చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉత్సాహం ఉంటేనే తాను పోటీ చేస్తానని కోమటిరెడ్డి చెప్పారు. అప్పుడు ప్రత్యక్ష్య రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కార్పొరేట్ స్కూల్స్ పేదలను దోచుకుంటున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తానే విద్యాశాఖ మంత్రిని అయితే అలాంటి స్కూల్స్ అన్నింటినీ మూసేస్తా అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా తమ పిల్లలను సర్కార్ స్కూళ్లలో చేర్పించాలని కోరారు. రైన విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని చెప్పారు. విద్యకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడినా తొలి పదేళ్లలో మన సమస్యలు తీరలేదని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో దాదాపు రూ.200కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ నిర్మిస్తున్నామని.. కులమతాలకు అతీతంగా విద్యార్థులు చదువుకోవాలన్నది తమ ప్రభుత్వ ఆశయమని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.