ముద్ర, నారాయణ పేట:
పట్టణంలోని 3 వ వార్డులోని గడపగడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తానని వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పోలేమోని పద్మ కృష్ణ అన్నారు. సోమవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డు పరిధిలో ముమ్మరంగా ఇంటింటికి తిరిగి హస్తాం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లతో కోరారు. ప్రచారం నిర్వహించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఏమి న్యాయం జరగలేదన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమం కాంగ్రెస్ ద్వారానే సాధ్యమన్నారు.