ముద్ర ప్రతినిధి,మేడ్చల్ జిల్లా :
మేడ్చల్ జిల్లా పరిధిలోని ఎల్లంపేట్,మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పీఠాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అలియాబాద్ మున్సిపాలిటీని మాత్రం ఎట్టకేలకు కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది.ఎల్లంపేట్ మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ గా లౌడియా శ్రీదేవి, మూడుచింతలపల్లి మున్సిపల్ చైర్మన్‌గా జాము రవి ఎన్నికయ్యారు, వైస్ చైర్మన్‌గా కొల్తూర్ మోర్సుబాయి, శశిరేఖ ఎన్నుకోబడ్డారు.అలియాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గా కాంగ్రెస్ అభ్యర్థి కంఠం శిరీష కృష్ణ రెడ్డి ఎన్నికయ్యారు.
మున్సిపల్ కార్యాలయాలలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కౌన్సిలర్లు ఏకగ్రీవంగా వీరిని ఎన్నుకున్నారు.
