ముద్ర మల్కాజిగిరి:
మల్కాజిగిరి డివిజన్లలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కృష్ణారెడ్డికి మాజీ కార్పొరేటర్ శ్రావణ్ సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషన్ తో సమావేశమై డివిజన్ పరిధిలోని పలుకాలనీలలోని సమస్యలపై చర్చించారు.
ముఖ్యంగా సఫిల్గుడా చెరువు వద్ద కేంద్రం నిధులు రెండు కోట్ల రూపాయలతో మొదలు కావాల్సిన మురునీటి డైవర్షన్ పనులను వెంటనే చేపట్టాలని,దోమల బెడద పై చర్యలు తీసుకోవాలని, వీధి కుక్కల సమస్య చాలా తీవ్రంగా మారిందని యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరారు.
వీధి దీపాల నిర్వహణ సైతం అధ్వానంగా ఉందని,
శానిటేషన్ నిర్వహణ మెరుగుపరచాలని,శానిటేషన్ ఉద్యోగులకు జీతాలు సకాలం లో చెల్లించాలని కోరారు.