Take a fresh look at your lifestyle.

రెండు దశల్లో జనగణన – కలెక్టర్ ఖుష్బు గుప్తా

ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
………………………………………..
జన గణన కార్యక్రమం రెండు దశల్లో నిర్వహించనున్నామని మహబూబ్ నగర్ కలెక్టర్ ఖుష్బు గుప్తా వెల్లడించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జనగనణలో పాల్గొనే అధికారులకు నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.మొదటి దశలో ఇళ్ల జాబితా (హౌస్‌లిస్టింగ్,హౌస్ ఎన్యూమరేషన్), గృహాల గణన, మే 11 న ప్రారంభమై జూన్ 9 వరకు కొనసాగుతుందన్నారు. రెండవ దశలో జన గణన (పాపులేషన్ ఎన్యుమరేషన్) ప్రక్రియ 2027 ఫిబ్రవరి లో నిర్వహించబడుతుందని, మార్చి ఒకటి నాటికి రిఫరెన్స్ తేదీగా పరిగణిస్తారన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాల మౌలిక వసతులు,ప్రణాళిక ల రూపకల్పన లో జనగణన ఉపయోగ పడుతుందని కలెక్టర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నిర్వహిస్తున్న తొలి జనగణన అని, 2011 జనాభా గణన తర్వాత 2021 లో నిర్వహించ వలసిన ఈ ప్రక్రియ కోవిడ్ కారణంగా ఈ కార్యక్రమం ఇప్పుడు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. జనాభాపరంగా, పరిస్థితుల్లో గణనీయమైన మార్పులుచోటుచేసుకున్నాయన్నారు.ఇప్పుడు జరగనున్న జన గణనను దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారని, మొబైల్ యాప్‌లు, వెబ్ పోర్టల్‌లను ఉపయోగించి గణన ప్రక్రియను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ప్రత్యేక పోర్టల్‌ను గణన ప్రారంభానికి 15 రోజుల ముందు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
మొదటి దశలో నిర్వహించే ఇళ్ల జాబితా, గృహాల గణనలో ఇంటి నిర్మాణం, ఇంటి పరిస్థితి, కుటుంబ యజమాని వివరాలు, తాగునీటి సౌకర్యం, మురుగునీటి పారుదల వ్యవస్థ, మరుగుదొడ్ల లభ్యత, వంటగది సౌకర్యం వంటి వివరాలతో పాటు రేడియో, టెలివిజన్, స్మార్ట్ ఫోన్ , కంప్యూటర్, సైకిల్, కారు వంటి గృహ సౌకర్యాలకు సంబంధించిన మొత్తం 33 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి సేకరించే విధానాన్ని ఈ శిక్షణలో వివరించనున్నట్లు తెలిపారు.జనాభా లెక్కలు సేకరించడం ఒక ముఖ్యమైన బాధ్యతతో పాటు సవాలుతో కూడుకున్న పని అని ఆమె పేర్కొన్నారు. అధికారులు శిక్షణ లో తెలియచేసే ప్రతి విషయాన్ని అవగాహనచేసుకోవాలని,సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని తప్పకుండా గణనలో చేర్చాలని అధికారులకు ఆమె ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుండి ఉపాధి కోసం వచ్చిన వలస కూలీలను గణనలో చేర్చి వారి వివరాలను నమోదు చేయాలన్నారు.ఫీల్డ్ స్థాయిలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ముందస్తుగా సిద్ధంగా ఉండాలని, ఉన్నతాధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తూ సమస్యలను పరిష్కరించుకుని జనగణనను విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ కార్యాలయం ఏ.డి.రాజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారారెవెన్యూ గ్రామాలను, పట్టణాల్లోని వార్డులను సి.ఎం.ఎం.ఎస్ పోర్టల్ ద్వారా హౌస్ లిస్టింగ్, ఎన్యూమరేషన్ చేయడం శిక్షణ లో వివరించారు.
జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి రవీందర్ మాట్లాడుతూ అన్ని
శాఖల అధికారులు సమన్వయంతో జన గణన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సూచించారుఈ కార్యక్రమంలో జడ్పి సిఇఓ,ఇంచార్జి డిపిఓ వెంకట రెడ్డి, జిల్లా విద్యా శాఖ అధికారి ప్రవీణ్ కుమార్,జిల్లా మాస్టర్ ట్రైనర్ బాలు యాదవ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.