Take a fresh look at your lifestyle.

పెద్ద చెరువు సుందరీకరణ పనుల డిజైన్ల పూర్తి – ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

 

ముద్ర కాప్రా:

ఉప్పల్ నియోజకవర్గంలోని హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువు సుందరీకరణ పనులు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో, పనుల డిజైనింగ్ ప్రక్రియ పూర్తయిందని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు
సుమారు రూ.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ సుందరీకరణ పనులకు సంబంధించి చెరువును ఎలా అభివృద్ధి చేయాలనే అంశంపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి , డిజైనింగ్ పనులను పర్యవేక్షిస్తున్న విమోస్ ఏజెన్సీ ప్రతినిది యూసుఫ్ , శ్రీనాథ్ తో కలిసి చెరువును పరిశీలించారు.
చెరువులో గుర్రపు డెక్క విపరీతంగా పెరిగి ఉండడం వల్ల నాచారం ప్రాంత ప్రజలు దోమల సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని తక్షణమే చెరువులోని నీటిని ఖాళీ చేసి చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. దీనిపై స్పందించిన ఏజెన్సీ బాధ్యులు చెరువులోని నీటిని తొలగించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
గత 30-40 సంవత్సరాలుగా ఈ చెరువును ఏ ప్రజాప్రతినిధి పట్టించుకోలేదని, ప్రస్తుతం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రత్యేక చొరవతో చెరువు అభివృద్ధికి రూ.30 కోట్ల నిధులు మంజూరు కావడం పట్ల హెచ్ఎంటి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బారాసా రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్, ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.