ముద్ర ప్రతినిధి, నిర్మల్:
తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగటంతో జిల్లా వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది. ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. తమ సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ సిబ్బంది డిపో ఎదుట నిరసనలు వ్యక్తం చేశారు. సమ్మెతో నిర్మల్ డిపోలో 156, భైంసా డిపోలో 75 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి.