ముద్ర, కోరుట్ల;
ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయడానికి కోరుట్ల డిపో ఉద్యోగులందరూ కలిసి జేఏసీగా ఏర్పడి సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, యూనియన్ల పునరుద్ధరణ, పెండింగ్ పిఆర్సీలు, అలాగే 32 డిమాండ్ల పైన మరియు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆర్టీసీ గురించి పెట్టిన అంశాలను నెరవేర్చమని ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ కు ప్రభుత్వం జేఏసీ నాయకులను చర్చలకు పిలవడం జరిగింది. చర్చలు విఫలం కావడంతో జేఏసీ సమ్మె చేయడం జరుగుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా ఆర్టీసీ జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లను పరిష్కరించవలసిందిగా కోరుట్ల డిపో ఆర్టీసీ జేఏసీ కోరడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కోరుట్ల డిపో ఉద్యోగులoదరు కలిసి ఆర్టీసీ జేఏసీగా ఏర్పడి పాల్గొనడం జరిగింది.