Take a fresh look at your lifestyle.

మణికొండ జెడ్పీ పాఠశాలలో ఘనంగా యోగా దినోత్సవం

  • యోగా గురు ప్రదీప్ చే 600 విద్యార్ధులకు శిక్షణ.

ముద్ర, తెలంగాణ బ్యూరో : అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని శనివారం హైదరాబాద్‌లోని మణికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ప్రముఖ యోగా గురువు, సీనియర్ నటుడు ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో 600 మంది పాఠశాల విద్యార్ధినీ విద్యార్ధులు యోగా శిక్షణలో పాల్గొన్నారు. యోగాసనాలు, ప్రాణాయామం, క్రియలు అభ్యసించారు.ఈ యోగా శిక్షణ కార్యక్రమంలో స్పాన్సర్ రామకృష్ణారెడ్డి, బుల్లితెర నటుడు మధు, జబర్దస్త్ నటుడు ఫణి, వి ఆర్ ఫర్ యూ సంస్థకు చెందిన నాగేంద్ర, బాపూజీ, తిరుమల హిల్స్ రంగాచారి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నిరంజన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఈ యోగా కార్యక్రమంలో భాగంగా జబర్ధస్త్ ఫణి చేసిన మిమిక్రీ, హాస్యనట ప్రదర్శన ప్రధానాకర్షణగా నిలిచింది.ఈ సందర్భంగా యోగా గురువు ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ యోగా మన సంస్కృతిలో ఒక భాగమని, ప్రతి రోజు యోగా అభ్యసించడం వలన రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా శ్వాస వ్యాయామాలు ఒత్తిడిని తగ్గిస్తాయన్నారు. మానసిక ప్రశాంతత, శరీరక బలాన్ని పెంచడానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. ప్రకృతితో మమేకమై యోగా చేయడం వలన బహుళ ప్రయోజనాలు ఉన్నాయన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నిరంజన్ మాట్లాడుతూ ఇకపై ప్రతిరోజు 15 నిమిషాల పాటు విద్యార్ధుల చేత యోగా అభ్యసన చేయిస్తామని చెప్పారు.మన దేశానికి సొంతమైన యోగా విద్యా ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాల్లో ప్రాచుర్యం పొందుతుందని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.