ముద్ర, తొగుట: తొలి ఏకాదశి పర్వదినంను పురస్కరించుకొని మండలంలోని వెంకట్రావుపేట వేణుగోపాల స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది.ఆలయ కమిటీ చైర్మన్ రాయరావు అరుణ~రఘుపతి రావు, ఆలయ అర్చకులు రామకృష్ణ చార్యులు ఆధ్వర్యంలో ఆలయం లో శ్రీ వేణుగోపాల స్వామి వారికి ప్రత్యేక అర్చన, తులసి అభిషేకం, ప్రత్యేక పూజాది కార్యక్రమం లు నిర్వహించారు. శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయములో తొలి ఏకాదశి సందర్భముగా సహకరించిన గ్రామ ప్రజలకు ధన్యవాదములు తెలుపుకుంటూ గ్రామము దిన దిన అభివృద్ధిచెందాలని మన వేణుగోపాల్ స్వామి కృపా కటాక్షాలు అందరిమీదా ఉండాలని స్వామి వారి మంగళ శాసనములు తెలియజేశారు.తొలి ఏకాదశి సందర్బంగా గ్రామంలో పూర్తి స్థాయిలో ప్రజలు భక్తి శ్రద్దలతో శాఖాహారం తీసుకున్నందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.తొగుట ఏ ఎస్ ఐ, ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే గ్రామంలోని దళిత గోవిందం వెంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భారీగా మహిళలు, పాల్గోన్నారు.
