ముద్ర కాప్రా
కాప్రా ఆదిత్య నగర్ లోని విజయ హైస్కూల్ పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు.యజమాన్యం వివిధ భాగాల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు మెమొంటోలను అందజేసి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో తొమ్మిదో తరగతి విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులకు ఆకట్టుకున్నాయి.
అనంతరం విద్యార్థులను ఉద్దేశించి పాఠశాల కరెస్పాండెంట్ రాజేశ్వర్ ప్రసంగిస్తూ..విద్యార్థులు ఉత్తమ విద్యను అభ్యసిస్తూ భవిష్యత్తులో అనేక రంగాలలో రాణించాలని పేర్కొన్నారు.
ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ గంప నాగేశ్వరరావు ఈ కార్యక్రమానికి విచ్చేసి విద్యార్థులకు చదువు గురించి,పరీక్షలకు సంసిద్ధత ఎలా అవ్వాలో వివరించి విద్యార్థులను ఉత్తేజపరిచారు.
కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కొప్పునూరు వీణ,ప్రధానోపాధ్యాయురాలు అద్దంకి పద్మావతి,ఉపాధ్యాయులు,విద్యార్థులు,
పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు.