క్లాస్మేట్ క్లబ్ “365 రోజులు – 365 ప్రోగ్రామ్స్”లో భాగంగా 128వ రోజు ప్రత్యేక కార్యక్రమం
జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “365 రోజులు – 365 ప్రోగ్రామ్స్” కార్యక్రమంలో భాగంగా 128వ రోజు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో సేవలందిస్తున్న రెడ్ క్రాస్ సభ్యులను జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవికుమార్, డీఈఓ రమేష్ కుమార్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, వాసవి క్లబ్ ప్రతినిధులు, క్లాస్మేట్ క్లబ్ సభ్యులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ, క్లాస్మేట్ క్లబ్ సభ్యులు చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతతో సమాజంలో పేదరికంలో ఉన్న వారికి సహాయం చేస్తూ సమాజ మార్పుకు కృషి చేయాలని సూచించారు. సేవాభావంతో ముందుకు వచ్చే యువత సమాజానికి ఆదర్శమని అన్నారు.
క్లాస్మేట్ క్లబ్ వ్యవస్థాపకులు వాస వాస రాఘవేందర్ మాట్లాడుతూ, వేసవి కాలంలో రక్తం అవసరం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అందువల్ల వివిధ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి రక్తదాన శిబిరాలు నిర్వహించాలని కోరారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో క్లాస్మేట్ క్లబ్ రాష్ట్ర కార్యదర్శి కేపీ ప్రసాద్, నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ కుమార్, జిల్లా కోశాధికారి కాజా, నాగర్ కర్నూల్ మండల విద్యాధికారి కురుమయ్య, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, వాసవి క్లబ్ ప్రతినిధి కొట్ర బాలాజీ, రెడ్ క్రాస్ సభ్యులు రమేష్ రెడ్డి, పోల శ్రీను, డి. రాజయ్య, డి.వి. నారాయణ తదితరులు పాల్గొన్నారు.